తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవిభక్త కవలలకు.. అరుదైన శస్త్రచికిత్స సక్సెస్​!

Conjoined Twins Operation Success: బంగాల్​లోని ఓ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఒకే కాలేయంతో ఉదరభాగం అతుక్కుని పుట్టిన కవలలకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి విడదీశారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్​ చేస్తామని డాక్టర్లు తెలిపారు.

NRS doctors perform rare surgery to separate conjoined babies
NRS doctors perform rare surgery to separate conjoined babies

By

Published : Jul 9, 2022, 10:15 PM IST

Conjoined Twins Operation Success: ఒకే కాలేయంతో ఉదర భాగం అతుక్కుని పుట్టిన అవిభక్త కవల పిల్లల్ని శస్త్రచికిత్స చేసి విజయవంతంగా విడదీశారు బంగాల్​లోని కోల్​కతా ఎన్​ఆర్​ఎస్ ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

శస్త్రచికిత్స ముందు శిశువులు
శస్త్రచికిత్స తర్వాత శిశువులు

"దక్షిణ దినాజ్​పుర్​కు చెందిన ఓ భార్యభర్తలు తమకు పుట్టిన నవజాత అవిభక్త కవలలను తీసుకుని మా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే మేము వారిని అడ్మిట్​ చేసుకుని.. వివిధ పరీక్షలను నిర్వహించాం. ఇద్దరు పిల్లల శరీరంలోని అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాలేయాలు మాత్రం పొత్తి కడుపు ద్వారా కలిసి ఉన్నాయి. శస్త్రచికిత్స చేసి వేరు చేయాలని నిర్ణయించాం. ఈ శస్త్రచికిత్స సుమారు రెండు గంటల పాటు జరిగింది. మొత్తానికి అనుకున్నది సాధించాం"

-- నిరూప్​ బిశ్వాస్​, ఎన్​ఆర్​ఎస్ ఆసుపత్రి​ వైద్యుడు

ఇద్దరు నవజాత శిశువులు శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. "శుక్రవారం ఉదయం ఒక నవజాత శిశువుకు గుండెపోటు వచ్చింది. వెంటనే అత్యవసర చికిత్స అందించాం. ఇప్పుడు బాగానే ఉంది. మరో 5-6 రోజుల పాటు పరిశీలనలో ఉంచి పిల్లలను డిశ్చార్జ్​ చేస్తాం. ప్రస్తుతం ఇద్దరు నవజాత శిశువులను వైద్యుల కమిటీ పర్యవేక్షిస్తుంది" అని డాక్టర్లు తెలిపారు.

ఇవీ చదవండి:ఎడతెరిపి లేని వాన.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం!

'నాకు ఇండియానే నచ్చింది'.. పోలీసులకు కృతజ్ఞతలు: బధిర యువతి గీత

ABOUT THE AUTHOR

...view details