జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ) వల్ల గూర్ఖాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బంగాల్లోని కాలింపోడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కొండ ప్రాంతాల్లోని ప్రజల్లో భయం సృష్టించేందుకు టీఎంసీ అసత్యాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.
"మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంత వరకు.. ఒక్క గూర్ఖాకు హాని జరగదు. ఎన్ఆర్సీ ఇంకా అమలు కాలేదు. కానీ, ఎప్పుడు అమలులోకి వచ్చినా.. ఒక్క గూర్ఖాను వెళ్లిపోవాలని చెప్పం. ఎన్ఆర్సీ గురించి టీఎంసీ అబద్ధాలు చెబుతోంది. గూర్ఖాల్లో భయం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది."