తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.80వేలు జీతం.. వివరాలు ఇవిగో.. - npcil job recruitment 2023

NPCIL Jobs For Freshers : నిరుద్యోగులకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) సంస్థ శుభవార్త చెప్పింది. 120కి పైగా ఉద్యోగాల భర్తీకి ఈ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, జీతం, వయో పరిమితి, అర్హతలు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

NPCIL RECRUITMENT 2023
NPCIL 2023 రిక్రూట్​మెంట్​

By

Published : May 16, 2023, 3:19 PM IST

NPCIL Jobs For Freshers : హెచ్ఆర్, ఎఫ్ అండ్ ఏ, ఎంఎం, లీగల్ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్ పోస్టులను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తోంది. అలాగే హిందీ ట్రాన్స్​లేటర్ (జేహెచ్​టీ) పోస్టుల కోసం కూడా ఉద్యోగార్థులను ఆహ్వానిస్తోంది. ఎన్​పీసీఐఎల్ మొత్తం 128 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆయా పోస్టులకు సంబంధించి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు లెవల్-06 నుంచి లెవల్-10 వరకు (అంటే నెలకు రూ రూ.50,268 నుంచి రూ.79,662) జీతాన్ని పొందుతారు. జూనియర్ హిందీ ట్రాన్స్​లేటర్ పోస్టుకు వయో పరిమితి 18 నుంచి 28 ఏళ్లుగా ఉంది. అదే డిప్యూటీ మేనేజర్ (హెచ్​ఆర్, ఎఫ్ అండ్ ఏ, సీ అండ్ ఎంఎం, లీగల్) పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 18 నుంచి 30 ఏళ్లలోపు వారై ఉండాలి. ఇప్పటికే ఎన్​పీసీఐఎల్ లో పనిచేస్తున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే వారికి ఎలాంటి వయో పరిమితి లేదు.

ఎంపిక విధానం..
NPCIL Jobs : పైపోస్టుల ఎంపికకు తొలుత రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో ప్రదర్శనను బట్టి ఉద్యోగులను కమిటీ ఎంపిక చేస్తుంది. ఆసక్తి ఉన్నవారు ఎన్​పీసీఐఎల్ అధికారిక వెబ్​సైట్ కు వెళ్లి అప్లయ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు మే 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 29. అప్లికేషన్ ఫీజు పోస్టులను బట్టి మారుతుంది. అర్హతలను చూసుకుంటే.. డిప్యూటీ మేనేజర్ హెచ్ ఆర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ అనంతరం ఎంబీఏ లేదా అందుకు సమానమైన పర్సనల్ మేనేజ్​మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్​లో పీజీ కోర్సును పూర్తి చేసి ఉండాలి.

అర్హతలు ఏంటంటే..
NPCIL Job Openings 2023 : డిప్యూటీ మేనేజర్ ఎఫ్ అండ్ ఏ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే సీఏ, ఐసీడబ్ల్యూఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏ ఫుల్ టైమ్​లో పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులే. అలాగే ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న ఏదైనా కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్​లో స్పెషలైజేషన్ కోర్సు చేసినవారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ సీ అండ్ ఎంఎం పోస్టులకు అప్లై చేసేవారు ఏదైనా బ్రాంచ్​లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎంబీఏ లేదా దానికి సమానమైన కోర్సు తప్పక చేసి ఉండాలి.

డిప్యూటీ మేనేజర్ లీగల్ పోస్టులకు ఫుల్ టైమ్ లా డిగ్రీని పూర్తి చేసినవారు అర్హులు. అదే జూనియర్ హిందీ ట్రాన్స్​లేటర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి హిందీ లేదా ఆంగ్ల భాషలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులుగా బ్యాచిలర్ డిగ్రీ చేసినవారు కూడా అర్హులే. ఈ రెండు సబ్జెక్టులు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ గా ఉండి, మిగిలినవి మెయిన్ సబ్జెక్టుగా ఉండి గుర్తింపు పొందిన కళాశాల నుంచి డిప్లొమా పొందినవారు లేదా హిందీ నుంచి ఇంగ్లిష్​కు అనువాదం చేసే సర్టిఫికెట్ కోర్సు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష రుసుము ఎంతంటే..
NPCIL Job Recruitment 2023 : అప్లికేషన్ ఫీజు.. ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉంది. డిప్యూటీ మేనేజర్ హెచ్ ఆర్, ఎఫ్ అండ్ ఏ, సీ అండ్ ఎంఎం, లీగల్ పోస్టులకు పరీక్షా రుసుమును రూ.500గా నిర్ణయించారు. అదే జూనియర్ హిందీ ట్రాన్స్​లేటర్ పోస్టులకు ఎగ్జామ్ ఫీజు రూ.150గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details