కరోనా టీకా రెండో డోసు కోసం కొవిన్ యాప్‌లో ఆటోమేటిక్ అపాయింట్మెంట్ను తీసుకోవడం లేదని వ్యాక్సిన్‌పై ఏర్పాటు చేసిన సాధికార బృందం ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. డోసుల మధ్య నిర్ణయించిన వ్యవధి ఆధారంగా స్వయంగా షెడ్యూల్‌ను నిర్ణయించుకోవాలని తెలిపారు.
'కొవిన్'లో మార్పులు- రెండో డోసు షెడ్యూలింగ్ బంద్! - కొవిన్ రెండో డోసు షెడ్యూల్
కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య విరామాన్ని సవరించిన నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు అధికారులు. కొవిన్ యాప్‌లో రెండో డోసు అపాయింట్మెంట్ను ఆటోమేటిక్‌గా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
'కొవిన్'లో రెండో డోసు ఆటోమెటిక్ షెడ్యూల్ బంద్!
కొవిషీల్డ్ డోసుల మధ్య ఉండాల్సిన వ్యవధిని సవరించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు శర్మ. ఈ టీకా రెండు డోసుల మధ్య '4 నుంచి 8 వారాల' విరామం ఉండాలని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. ప్రస్తుతం.. తొలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు. అయితే.. రెండు డోసుల మధ్య విరామానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.