తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రోటీన్ ఆధారిత నొవొవ్యాక్స్ టీకాకు​ అత్యవసర అనుమతి - corona vaccine latest

Novovax emergency use: భారత్​లో తొలి ప్రోటీన్ ఆధారిత టీకా అందుబాటులోకి వచ్చింది. నొవొవ్యాక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కు డీసీజీఐ అత్యవసర అనుమతి ఇచ్చింది.

novovax
ప్రోటీన్ ఆధారిత నొవొవ్యాక్స్ టీకాకు​ అత్యవసర అనుమతి

By

Published : Mar 23, 2022, 8:16 AM IST

Novovax News: నొవొవ్యాక్స్ అభివృద్ధి చేసిన టీకాకు భారత్​తో అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. 12-18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు దీన్ని ఇవ్వనున్నారు. భారత్​లో ఈ టీకాను సీరం సంస్థ కొవొవ్యాక్స్ పేరుతో ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో అనుమతి పొందిన మొదటి ప్రోటీన్ ఆధారిత టీకా ఇదే కావడం గమనార్హం.

తమ టీకాకు భారత్​ ఆమోదం తెలపడంపై నొవొవ్యాక్స్ సీఈఓ స్టాన్లె సీ ఎర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమకు గర్వకారణం అన్నారు. వ్యాక్సిన్ సురక్షితం, సమర్థవంతం అని తేలిన తర్వాతే డీసీజీఐ పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.

Novovax Vaccine

సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా కూడా ఈ విషయంపై స్పందించారు. ఇది మరో మైలురాయి అని పేర్కొన్నారు. భారత్​లో ప్రోటీన్ ఆధారిత టీకాను ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.

18 ఏళ్లు పైబడిన వారికి కొవొవ్యాక్స్​ ఇచ్చేందుకు గతేడాది డిసెంబర్​లోనే అనుమతి ఇచ్చింది డీజీసీఐ. ఐరోపా సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సంస్థ తయారు చేసిన టీకాకు అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు పిల్లలకు దీన్ని ఇచ్చేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి:రష్యా ప్రతిపక్షనేతకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details