గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ మాన్ అలియాస్ ఫజ్జాను ఎన్కౌంటర్లో కాల్చి చంపారు దిల్లీ పోలీసులు. శనివారం రాత్రి జరిపిన ఎన్కౌంటర్లో ఫజ్జా గ్యాంగ్‌కు చెందిన మరో క్రిమినల్నూ చంపినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది..

70 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫజ్జాను దిల్లీ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. అయితే.. అనారోగ్యం కారణంగా అతడ్ని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే గురువారం ఆసుపత్రి నుంచి పారిపోయాడు ఫజ్జా. తర్వాత పోలీసులకు చిక్కకుండా రోహిన్ సెక్టార్ 14లోని తులసి అపార్ట్మెంట్లో దాక్కున్నాడు.
శనివారం నిందితుడు ఉన్న స్థలాన్ని గుర్తించిన దిల్లీ పోలీసులు.. ఎన్కౌంటర్ జరిపి ఫజ్జాను మట్టుబెట్టారు.