తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​డీఏలో మహిళల ప్రవేశ పరీక్షలపై కేంద్రం క్లారిటీ

వచ్చే ఏడాది మే నెలలో మహిళలకు ఎన్​డీఏ ప్రవేశపరీక్షకు (nda women eligibility) సంబంధించి ప్రకటన విడుదల చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నిపుణల ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణా విధానాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

women eligility
ఎన్​డీఏలో మహిళల ప్రవేశం

By

Published : Sep 21, 2021, 5:37 PM IST

నేషనల్ డిఫెన్స్​ అకాడమీ(ఎన్​డీఏ)లో చేరేందుకు మహిళలకు ప్రవేశపరీక్ష నిర్వహణపై వచ్చే ఏడాది మే నెలలో ప్రకటన విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం మహిళలకు మౌలిక వసతుల ఏర్పాటుపై కృషి చేస్తున్నామని పేర్కొంది. వైద్య ప్రామాణికతలను మెరుగుపరిచే దిశగా దృష్టి సారిస్తున్నామని తెలిపింది. నిపుణల ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణా విధానాన్ని కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు మంగళవారం సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొంది.

నేషనల్ డిఫెన్స్​ అకాడమీలో (ఎన్‌డీఏ) మహిళలకు (nda women eligibility) అనుమతిపై గత నెల కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షకు మహిళలను మహిళలను అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. వారికి అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి :ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో​ నయా రాజకీయం!

ABOUT THE AUTHOR

...view details