ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ మధ్య ఇటీవల జరిగిన భేటీపై శివసేన విభిన్నంగా స్పందించింది. 'అందులో అర్థంకాని రహస్యమేం లేదు' అని ఆ పార్టీకి చెందిన 'సామ్నా' పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవార్‌ను వివిధ సందర్భాల్లో కలుస్తూనే ఉంటారని చెప్పింది.
మహారాష్ట్రలో భాజపా 'ఆపరేషన్ కమల్'లో భాగంగా.. కొత్త కూటములు ఏర్పడతాయని వినిపిస్తున్న ఊహాగానాలను 'సామ్నా' సంపాదకీయం తోసిపుచ్చింది.
"ఫడణవీస్‌కు, శరద్‌పవార్‌కు మధ్య జరిగిన భేటీలో రహస్యం ఏమీ లేదు. అలా భావిస్తున్న వారి గురించి మాకు తెలియదు."