ప్రముఖ సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్ కన్నుమూశారు. బహుజన ఉద్యమంలో తన స్వరాన్ని వినిపించిన 81 ఏళ్ల ఓంవేద్.. మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని కేసేగావ్ గ్రామంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
ప్రముఖ రచయిత గెయిల్ ఓంవేద్ కన్నుమూత - రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్
సామాజిక కార్యకర్త, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్.. మహారాష్ట్ర సంగ్లీ జిల్లా కేసేగావ్ గ్రామంలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. దళిత, మహిళ, రైతు, కుల సమస్యలపై పలు రచనలు చేశారు ఓంవేద్. భర్త భరత్ పటాంకర్‌తో కలిసి శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటుకు కృషి చేశారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ విజన్, ఆలోచనలపై విస్తృత అధ్యయనం చేసిన ఆమె.. భర్త భరత్ పటాంకర్‌తో కలిసి శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. అమెరికాలోని మినియాపోలిస్‌లో జన్మించిన ఓంవేద్.. అంబేడ్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్‌డీ చేసేందుకు భారత్ వచ్చారు. ఆ తరువాత ఇక్కడే స్థిరపడి భారత పౌరురాలిగా జీవించిన ఆమె.. దళిత రాజకీయాలు, మహిళా, రైతు పోరాటాలపై 25కు పైగా పుస్తకాలు రచించారు. దళిత, మహిళా, పర్యావరణ సమస్యలపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశారు.
ఇదీ చూడండి:ఎంట్రీ సాంగ్ నచ్చలేదని.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే?