కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో ప్రముఖ పర్యావరణవేత్త జీవీ గిరీష్‌పై కొందరు యువకులు దాడి చేశారు. స్నేహితులతో కలిసి వెళ్తున్న ఆయన వాహనాన్ని నడిరోడ్డుపై ఆపి మరీ గొడవకు దిగారు. వాహనం దిగిన గిరీష్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అడ్డువచ్చిన ఆయన స్నేహితులనూ కొట్టారు. ఆగస్టు 31న కంబిహళ్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
గిరీష్ తమ గ్రామ యువతిని వేధించారని ఆరోపిస్తూ యువకులు ఈ దాడి చేశారు. అయితే ఆయన మాత్రం దీన్ని ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.