China Robo Soldiers: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి సహా సరిహద్దుల్లో ఎలాంటి రోబో సైనికులు కనిపించలేదని తెలిపాయి భారత భద్రతా దళాల్లోని ఉన్నత వర్గాలు. చైనా ఆర్మీలో రోబో సైనికులను మోహరించినట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పందించాయి.
తుపాకులతో ఉన్న రోబో సైనికులు కంటపడలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఒక్క రోబో సైనికుడు ఎల్ఏసీ వెంట లేకున్నా.. ఆ నిర్ణయం చలికి అసలు తట్టుకోలేని డ్రాగన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఉపకరిస్తుందని చెప్పారు.
''శీతాకాలం ఎముకలు కొరికే చలిలో చైనా సైనికులు ఉండలేరు. సైన్యంలో రోబోలను మోహరించడం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఉపకరిస్తుంది. అది వారికి మేలు చేసేదే.''
- ఆర్మీ ఉన్నత వర్గాలు
అంతటి చలిలో గస్తీ కాయడం డ్రాగన్ సైనికులకు పెను సవాలేనని, తమ శిబిరాల్లో నుంచి అలా వచ్చి కాసేపట్లోనే లోపలికి వెళ్లిపోతారని సైనిక వర్గాలు వెల్లడించాయి. గతేడాది కూడా చైనా సైన్యానికి ఈ ఇబ్బందులు తప్పలేదని వివరించాయి.
భారత దళాలు పవర్ఫుల్..