దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించిన ఒక రోజు అనంతరం ఆ దేశ రాయబారి రాన్ మల్కా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో షాక్కు గురికాలేదని, ఈ దాడికి సంబంధించి నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయన్నారు. ఇది ఉగ్రవాదుల దాడి అని తేల్చేందుకు అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ దర్యాప్తు అన్ని కోణాల్లో జరుగుతోందన్నారు మల్కా. 2012లో ఇజ్రాయెల్ దౌత్య అధికారులపై జరిగిన దాడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నామని తెలిపారు.
"ఇలాంటి ఘటనలతో పశ్చిమాసియాలోని దేశాలతో మాకున్న సత్సంబంధాలను అస్థిరపరిచేందుకు యత్నిస్తున్నారు. అయినా శాంతి నెలకొల్పే ప్రయత్నం మాత్రం ఆగదు. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా భారత ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. ప్రతి సమాచారాన్ని వారికి అందిస్తాం."