కశ్మీర్ గుప్కర్ అలియన్స్(పీపుల్స్ అసోయేషన్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్-పీఏజీడీ)లో కాంగ్రెస్ చేరడంపై వస్తున్న కథనాలపై ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. గుప్కర్ కూటమిలో కాంగ్రెస్ భాగం కాదని.. కేవలం ప్రజాస్వామ్య బద్ధంగా భాజపా 'ప్రజావ్యతిరేక చర్యల'ను బయటపెట్టేందుకే కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు ఆ పార్టీ ముఖ్య ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
జమ్ముకశ్మీర్ సహా దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తేల్చిచెప్పారు సుర్జేవాలా.