తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీ కోసం భార్యపై దాడా? సమ్మతం కాదు' - Bombay High court latest verdict news

భార్య టీ తయారు చేయకపోవడం భర్తను దాడికి ప్రరేపించే చర్య కాదని వ్యాఖ్యానించింది బొంబాయి హైకోర్టు. టీ తయారు చేయలేదని భార్యపై దాడి చేసిన ఓ వ్యక్తిని.. అతని కుమార్తె సాక్ష్యంతో దోషిగా తేల్చింది బొంబాయి హైకోర్టు.

Not making tea no provocation for husband to assault wife: HC
'టీ కోసం భార్యపై దాడా? సమ్మతం కాదు'

By

Published : Feb 25, 2021, 5:36 PM IST

భర్త కోసం టీ చేసేందుకు నిరాకరించడాన్ని... భార్యపై దాడికి కారణంగా అంగీకరించలేమని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. టీ చేయలేదని ఆవేశంలో భార్యపై దాడి చేసినందుకు భర్తను దోషిగా తేల్చిన కోర్టు.. భార్య వస్తువు కాదని పేర్కొంది.

"పెళ్లి అనేది ఆదర్శం, సమానత్వంతో కూడిన భాగస్వామ్యం. అయితే మహిళ.. పురుషుల ఆస్తి అనే ఆలోచనలో సమాజం ఇప్పటికీ ఉంది. పురుషుడు తన భార్యను వస్తువుగానే భావిస్తున్నాడు" అని జస్టిస్​ రేవతి మోహితే దేరే అభిప్రాయపడ్డారు.

ఇదీ జరిగింది

మహారాష్ట్ర సోలాపుర్​ జిల్లాలోని పందర్​పుర్​ ప్రాంతానికి చెందిన సంతోష్​ అక్తర్​(35).. తన భార్య టీ తయారు చేయడానికి నిరాకరించిందని ఆవేశంలో ఓ ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా.. వారం రోజులు చికిత్స పొందుతూ అక్కడే మరణించింది. ఈ ఘటన 2013లో జరిగింది. అంతకుముందు నుంచే వారి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించి 2016లో హత్యాయత్నం నేరారోపణ కింద అక్తర్​ను దోషిగా తేల్చిన స్థానిక కోర్టు.. 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది. దీనిపై అక్తర్​.. హైకోర్టులో సవాలు చేశాడు. అయితే అక్తర్ కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని.. అతని పిటిషన్​ను తిరస్కరించింది హైకోర్టు.

ఇదీ చూడండి:'మహిళ ఆస్తిపై తండ్రి వారసులకూ హక్కు'

ABOUT THE AUTHOR

...view details