తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హింసలో నా ప్రమేయం లేదు: లఖా సిధానా - దిల్లీ ర్యాలీ హింస లఖా సిధానా పాత్ర

ట్రాక్టర్ ర్యాలీ హింసలో తన ప్రమేయం లేదని మాజీ గ్యాంగ్​స్టర్ లఖా సిధానా తెలిపాడు. శాంతియుతంగానే ప్రదర్శన చేశామని చెప్పుకొచ్చాడు. దీప్​ సిద్ధూతో కలిసి సోమవారం ఒకే వేదికపై ఉన్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు.

not-involved-in-jan-26-delhi-violence-lakha-sidhana
హింసలో నా ప్రమేయం లేదు: లఖా సిధానా

By

Published : Jan 28, 2021, 5:30 AM IST

గణతంత్ర దినోత్సవాన దిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసలో తన ప్రమేయం లేదని గ్యాంగ్​స్టర్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన లక్​బీర్ సింగ్(లఖా సిధానా) తెలిపాడు. ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న ఘటనల్లో అతని పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రాగా.. వాటిని సిధానా ఖండించాడు. ఏ విషయం విచారణలో తేలుతుందన్నాడు.

"మేం ఔటర్ రింగ్ రోడ్డు వైపు 20మంది రైతు నేతలతో కలిసి శాంతియుతంగా ప్రదర్శన చేశాం. ఎర్రకోట వైపునకు వెళ్లాలన్న ఎజండా మాకెప్పుడూ లేదు" అని పీటీఐకి తెలిపాడు.

అలాగే ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న ఘటనలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధూతో కలిసి సోమవారం రాత్రి తాను ఒక వేదికపై ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను కూడా సిధానా ఖండించాడు. పంజాబ్​లోని బఠిండాకు చెందిన సిధానా.. సింఘు సరిహద్దుల్లో నవంబరు 26 నుంచి ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. అతనిపై గతంలో పదుల సంఖ్యలో కేసులుండగా పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details