సహజీవనంపై పంజాబ్, హరియాణా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించాలని అమ్మాయి, అబ్బాయి నిర్ణయించుకుంటే కోర్టు ఆపలేదని పేర్కొంది. తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరిన 17ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయి విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది. ఈ జంటకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేకించి పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. అలా జరగకుండా ప్రేమ జంటలకు రక్షణ కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.