తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్యాన్సర్‌ రాజధానిగా ఈశాన్య భారతం! - క్యాన్సర్​ కేసులు

ఈశాన్య భారతం దేశ క్యాన్సర్​ రాజధానిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ఐసీఎంఆర్​ నివేదిక. కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని తేల్చింది.

cancer capital of India
ఈశాన్య భారత్​లో క్యాన్సర్​

By

Published : Aug 19, 2021, 9:16 AM IST

ఈశాన్య భారతాన్ని క్యాన్సర్‌ కబళిస్తోంది. అక్కడి చాలా రాష్ట్రాల్లో ఈ ప్రాణాంతక వ్యాధి విలయతాండవం చేస్తోంది. తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐఎంసీఆర్‌).. ఎన్‌సీడీఐఆర్‌తో కలిసి చేసిన అధ్యయనం.. ఈశాన్య భారతంలో పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పపుమ్‌పారె జిల్లాలో ప్రతి లక్షమందిలో 219.8 మంది మహిళలు క్యాన్సర్‌ బాధితులుగా తేలారు. మిజోరాం రాజధాని ఐజోల్‌లో ప్రతి లక్ష మందిలో 269.4 మంది పురుషులు ఈ వ్యాధి బారిన పడ్డారు. 2020 లెక్కల ప్రకారం.. ఈశాన్య భారతంలో 50,317 క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో పురుషుల సంఖ్య 27,503, మహిళల సంఖ్య 22,814.

కొత్త కేసులు కూడా విపరీతంగా ఈ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని తేలింది. ఈశాన్యభారతం.. దేశ క్యాన్సర్‌ రాజధానిగా మారుతుందన్న ఆందోళనను ఐఎంసీఆర్‌ నివేదిక వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:పండ్లు, కూరగాయలే కొత్త క్యాన్సర్‌ ఔషధాలు!

ABOUT THE AUTHOR

...view details