మిజోరాంకి చెందిన బ్రూ తెగకు చెందిన వారికి తమ ప్రాంతంలో ఆశ్రయం కల్పించడంపై శనివారం.. త్రిపుర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర త్రిపుర దోలుబరి గ్రామంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనలో భాగంగా రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పంటించారు నిరసనకారులు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
ఉత్తర త్రిపురలోని అసోం-అగర్తలా జాతీయ రహదారిపైనా ఆందోళన చేశారు నిరసనకారులు. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, 20 మంది గాయాలపాలయ్యారు.