తెలంగాణ

telangana

ETV Bharat / bharat

25 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి - కేరళ ఎన్నికలు

కేరళ యూడీఎఫ్​లోని భాగస్వామ్యపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 25 ఏళ్ల తరువాత తొలిసారి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. కోజికోడ్ సౌత్ నియోజకవర్గం టికెట్​ను నూర్​బినా రషీద్​కు కేటాయించింది. ఎన్నికల్లో గెలిస్తే కేరళలో మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు నూర్​బినా.

Noorbina Rasheed, IUML's first woman candidate for Assembly polls in 25 years, says ensuring women's safety will be her top priority
25ఏళ్ల తరువాత..ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి

By

Published : Mar 22, 2021, 1:49 PM IST

Updated : Mar 22, 2021, 4:14 PM IST

25 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి

కేరళ కోజికోడ్ సౌత్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నూర్​బినా రషీద్​... అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. కేరళలోని యూడీఎఫ్​లోని భాగస్వామ్యపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్ ) తరఫున గత 25 ఏళ్లలో పోటీ చేస్తున్న మహిళగా నిలిచారు. చివరిసారిగా 1996లో ఐయూఎంఎల్​ తరఫున ఖామరున్నీసా పోటీ చేశారు.

" 25ఏళ్ల తరువాత ఈ సారి పార్టీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని నేను ఆశించాను. పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల్లో గెలిస్తే కేరళలో మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తాను. సమాజానికి సేవ చేస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడతా."

-- నూర్​బినా రషీద్, ఐయూఎంఎల్ కోజికోడ్ అభ్యర్థి

'ప్రజల కోరిక అదే'

అసెంబ్లీలోకి మరింత మంది మహిళలు రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు నూర్​బినా తెలిపారు. మహిళల సమస్యలు, అణగారిన వర్గాల బాధలను మహిళలు.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలరని ప్రజలు భావిస్తున్నారని వివరించారు.

ఐయూఎంఎల్ ఈ సారి 27 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.

కేరళలోని మొత్తం 140 స్థానాల్లో ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.

ఇదీ చదవండి:'కాంగ్రెస్​, భాజపా వల్లే చమురు ధరల మంట'

Last Updated : Mar 22, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details