తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Non Allowable Items In Train Journey : నెయ్యి, చికెన్​ ట్రైన్​లో తీసుకెళ్తే మూడేళ్లు జైలు శిక్ష! ఇంకా ఏం బ్యాన్ చేశారంటే..

Non Allowable Items In Train Journey : తమిళనాడు మదురైలో జరిగిన రైలు ప్రమాదంలో 9 మంది మరణానికి గ్యాస్ సిలిండర్ పేలడమేనని దర్యాప్తులో తేలింది. అయితే, అనుమతి లేని సిలిండర్​ను ఎలా తీసుకెళ్లారనే చర్చ ఇప్పుడు తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే రైళ్లలో అనుమతి ఉన్న వస్తువుల గురించి మరోసారి ప్రయాణికులకు గుర్తు చేసింది రైల్వే శాఖ.

Non Allowable Items In Train Journey
Non Allowable Items In Train Journey

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 5:09 PM IST

Non Allowable Items In Train Journey : ప్రమాదవశాత్తు రైలులోని గ్యాస్​ సిలిండర్​ పేలి 9 మంది మరణించిన ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. ఈ క్రమంలోనే అసలు అనుమతి లేని గ్యాస్ సిలిండర్​ను రైలులోకి ఎలా తీసుకువెళ్లారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు రైలులో ఏ ఏ పదార్థాలు తీసుకెళ్లొచ్చు? నిషేధిత వస్తువులతో ప్రయాణికుడు దొరికితే ఎలాంటి శిక్షలు వేస్తారు? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

  • తోలు/చర్మం
  • పేలుడు పదార్థాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు
  • పెట్రోల్, డీజిల్​, కిరోసిన్​, బాణసంచా
  • 20 కిలోల మించిన నెయ్యి
  • ఎండు గడ్డి, ఆకులు, పేపర్లు
  • చనిపోయిన కోళ్లు
  • యాసిడ్లు, మండే గుణం ఉన్న రసాయనాలు

వీటితో పాటు పొగ తాగడాన్ని కూడా రైల్వే శాఖ నిషేధించింది. రైళ్లలోనే కాకుండా స్టేషన్​లో తాగినా అపరాధంగా భావిస్తోంది. ఎవరైనా ప్రయాణికుడు పేలుడు పదార్థాలైన (Items Banned in Trains India) పెట్రోల్, గ్యాస్​తో ప్రయాణిస్తే రూ. 1,000 జరిమానా విధిస్తారు. ఫైన్​తో పాటు రైల్వే చట్టం 1989 సెక్షన్​ 164,165 ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష వేస్తారు.

ట్రైన్​లో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది మృతి
Madurai Train Accident Today : శనివారం ఉదయం తమిళనాడులోని మదురై రైల్వే స్టేషన్​ వద్ద ఆగి ఉన్న​ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది పర్యటకులు మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. దక్షిణాదిలో ఆధ్యాత్మిక పర్యటన కోసం ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి ఆగస్టు 17న ఓ టూరిస్ట్​ రైలు బయలుదేరింది. అందులో 60 మందికి పైగా యాత్రికులు తమిళనాడు నాగర్​కోయిల్​లోని పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని శనివారం తెల్లవారుజామున రైలులో మదురై చేరుకున్నారు. అయితే ఆ రైలు.. మదురై రైల్వే స్టేషన్​కు ఒక కిలో మీటరు దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తమతో పాటు తెచ్చుకున్న సిలిండర్​ను ఉపయోగించి టీ తయారు చేసుకుందామనుకున్నారు. అయితే టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్‌ పేలి మంటలు (Madurai Train Fire News) చెలరేగాయి. వెంటనే ఆ మంటలు రెండు కోచ్​లకు వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. అయితే కొందరు అందులోనే చిక్కుకుపోయి మరణించారు.

చెన్నై-బెంగళూరు ఎక్స్​ప్రెస్​లో పొగలు.. ప్రయాణికులు హడల్.. 12 నిమిషాల్లోనే..

Fire In Express Train : ఎక్స్​ప్రెస్​ రైలులో ఒక్కసారిగా మంటలు.. బెంగళూరు స్టేషన్​లోనే..

ABOUT THE AUTHOR

...view details