తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వ్యాప్తిపై ఎయిమ్స్​ డైరెక్టర్​ తీవ్ర హెచ్చరిక

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణం ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడమేనని అన్నారు ఎయిమ్స్​ డైరెక్టర్ డా.రణ్​దీప్ గులేరియా. సార్స్​ కోవ్​-2 వేగంగా సంక్రమించడమూ కారణంగా చెప్పారు. అయితే వైరస్​ను తేలిగ్గా తీసుకోరాదని, జాగ్రత్తలు పాటిస్తూ టీకా వేయించుకోవాలని కోరారు.

Non-adherence to COVID-19 norms, virulent strains could be behind surge in infections: AIIMS chief
'పరిస్థితి మారకపోతే ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి'

By

Published : Apr 12, 2021, 5:54 PM IST

భారత్​లో మరోసారి కరోనా విజృంభణకు ప్రజలు నిబంధనలను పాటించకపోవడం, సార్స్​ కోవ్-2 ఉద్ధృతంగా వ్యాపించడమే కారణమన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణ్​దీప్ గులేరియా. ప్రస్తుత పరిస్థితి మారకపోతే దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని సోమవారం హెచ్చరించారు.

"ఫిబ్రవరిలో కేసులు తగ్గుముఖం పడుతున్నప్పుడు వైరస్​ తొలగిపోతోందని భావించి ప్రజలు కరోనా నిబంధనల​ పట్ల నిర్లక్ష్యం వహించారు. వ్యాధిని తేలిగ్గా తీసుకున్నారు. మార్కెట్లు, రెస్టారెంట్లు, ఇతరత్రా స్థలాల్లో గుంపులుగా తిరిగారు. గతంలో వైరస్ బారినపడిన ఒక వ్యక్తి ద్వారా 30మందికి వ్యాధి సోకితే.. ప్రస్తుతం ఇంకా ఎక్కువమందికి వ్యాపిస్తోంది. దీనికి కారణం.. సార్స్​ కోవ్-2 మరింత తీవ్రంగా సంక్రమించడం కూడా కావొచ్చు.

ముఖ్యమైన పని అయితే గానీ ప్రజలు బయటకు రాకూడదు. క్షేత్రస్థాయిలో నిబంధనలు కఠినంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇప్పటి వరకు సాధించింది.. వృథాగా మిగులుతుంది."

- డా.రణ్​దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

ప్రజలు విధిగా టీకా వేయించుకోవాలని కోరారు గులేరియా. మాస్కులు ధరించి, నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.

దేశంలో సోమవారం ఒక్కరోజే 1,68,912 కేసులు రాగా మొత్తం బాధితుల సంఖ్య 1,35,27,717కు ఎగబాకింది.

ఇవీ చూడండి:

వాడిన మాస్కులతో పరుపులు- ఓ సంస్థ నిర్వాకం

సొంతూళ్లకు వలస కూలీల పయనం.. ఆ భయంతోనే?

ABOUT THE AUTHOR

...view details