తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు ఎన్​డీఏ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఎన్​డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. మూడు స్థానాల్లో వారు సమర్పించిన నామినేషన్లను తిరస్కరించింది ఎన్నికల సంఘం. అయితే.. ఇది రాజకీయ కుట్రలో భాగమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఏ.విజయ రాఘవన్​ ఆరోపించారు.

Nominations of three NDA candidates rejected in Kerala
కేరళలో ఎన్డీఏ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

By

Published : Mar 21, 2021, 5:54 AM IST

Updated : Mar 21, 2021, 6:51 AM IST

కేరళలో ముగ్గురు ఎన్​డీఏ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం. కన్నూర్​ జిల్లా తలసేరి, త్రిస్సూర్​లోని గురువాయూర్​, ఇడుక్కిలోని దేవీకుళం​ నియోజకవర్గాల్లో సంబంధిత పోలింగ్​ అధికారులు వీటిని తిరస్కరించారు.

తలసేరిలో ఎన్​.హరిదాస్​ సమర్పించిన నామినేషన్​ పత్రంలో భాజపా జాతీయ అధ్యక్షుడి సంతకం లేదనే కారణంతో నిరాకరణకు గురైంది. గురువాయూర్​లో భాజపా అభ్యర్థి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నివేదిత; దేవీకుళం​లో ఏఐఏడీఎంకే(ఎన్​డీఏ) తరఫున బరిలోకి దిగిన ధనలక్ష్మిల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. కారణాలు తెలియరాలేదు.

అయితే.. భాజపా, కాంగ్రెస్​ల రహస్య ఒప్పందంతోనే ఇద్దరు భాజపా సీనియర్​ నేతల నామినేషన్లను తిరస్కరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎల్​డీఎఫ్​ కన్వీనర్​ ఏ.విజయ రాఘవన్​ ఆరోపించారు. సీపీఎం, భాజపాల పరస్పర కుట్రతోనే.. నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని కేపీసీసీ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్​ దీటుగా తిప్పికొట్టారు.

ఇదీ చదవండి:పుదుచ్చేరి బరి: యానాం సీటు వదిలి కాంగ్రెస్ త్యాగం!

Last Updated : Mar 21, 2021, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details