తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నామినేషన్‌పై కాంట్రాక్టులు.. రాజ్యాంగ ఉల్లంఘనే' - central vigilence commission

నామినేషన్‌పై కాంట్రాక్టులు అప్పగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ స్పష్టంచేసింది. అలా అప్పగించిన కాంట్రాక్టుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని కేంద్ర శాఖలను సీవీసీ ఆదేశించింది.

nomination contracts
'నామినేషన్‌పై కాంట్రాక్టులు.. రాజ్యాంగ ఉల్లంఘనే'

By

Published : Apr 7, 2021, 6:53 AM IST

నామినేషన్‌పై కాంట్రాక్టులు అప్పగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) పేర్కొంది. ఆర్టికల్‌ 14 ప్రకారం అందరికీ సమానత్వపు హక్కు ఉంటుందని, కాంట్రాక్టుల్ని నామినేషన్‌పై అప్పగిస్తే ఆ పనులపై ఆసక్తి ఉన్న మిగతా వారి హక్కుల్ని నిరాకరించడమేనని చెప్పింది. నామినేషన్‌పై అప్పగించిన కాంట్రాక్టుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంచాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. నామినేషన్‌పై ఎందుకిచ్చారో కారణాలు కూడా ఆ వెబ్‌సైట్లలోనే సంక్షిప్తంగా చెప్పాలని పేర్కొంది. ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చే కాంట్రాక్టులు/ప్రాజెక్టులు/ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లన్నీ వేలం ప్రాతిపదికనే ఉండాలని స్పష్టం చేసింది.

ప్రకృతి విపత్తులు, ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంటుంది. అయితే ఈ విషయంలో తమ మార్గనిర్దేశకాలను పలు సంస్థలు పాటించలేదని గుర్తించినట్టు సీవీసీ చెప్పింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల సీఈవోలకు ఉత్తర్వులు పంపినట్టు వివరించింది.

ఇదీ చూడండి:ఈ నెల​ 9న భారత్-చైనా సైనికాధికారుల భేటీ!

ABOUT THE AUTHOR

...view details