క్షేత్రస్థాయిలో అసాధారణ పనితీరు కనబరిచిన వ్యక్తులను పద్మ అవార్డులకు నామినేట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో చాలా మంది ప్రతిభావంతులు, అసాధారణ వ్యక్తులు ఉన్నప్పటికీ.. వారు ఎవరికీ తెలియకుండా సాధారణంగా ఉండిపోతారని మోదీ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల సమాచారం తెలిస్తే.. వారిని పద్మ అవార్డుకు నామినేట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రజలకు సూచించారు.
నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్15 వరకు అందుబాటులో ఉంటుందన్న ప్రధాని.. ఈ మేరకు పద్మ అవార్డుల ఎంపికకు సంబంధించిన వెబ్‌సైట్ లింక్‌ను(padmaawards.gov.in) తన ట్విట్టర్ పోస్టుకు జత చేశారు.