తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం!' - యూపీ వ్యాక్సినేషన్

ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఉత్తర్​ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం వినూత్నంగా ఆలోచించింది. టీకా తీసుకున్న ఉద్యోగులకే మే నెల జీతం ఇవ్వనున్నట్లు పేర్కొంది.

covid vaccine
కొవిడ్ టీకా, వ్యాక్సిన్

By

Published : Jun 2, 2021, 12:43 PM IST

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా అందరూ టీకా తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఉత్తర్​ప్రదేశ్ ఫిరోజాబాద్ అధికార యంత్రాంగం సరికొత్త నిర్ణయం తీసుకుంది. టీకా వేయించుకుంటేనే నెల జీతం ఇవ్వనున్నట్లు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలిపింది.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్.. 'నో వ్యాక్సిన్ నో శాలరీ' అని ఆదేశించారని చీఫ్​ డెవలప్​మెంట్ ఆఫీసర్ చర్చిత్ గౌర్ స్పష్టం చేశారు. టీకా తీసుకోని ఉద్యోగులకు మే నెల జీతం ఆపేయనున్నట్లు తెలిపారు. సాలరీ ఆగిపోతుందనే భయంతో ఉద్యోగులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:విదేశీ టీకాల రాకకు డీసీజీఐ లైన్‌క్లియర్‌..!

ABOUT THE AUTHOR

...view details