తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేయబోమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో భాజపాకు మద్దతిచ్చిన అన్నాడీఎంకేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో సీఏఏకు మద్దతుగా అన్నాడీఎంకే, పీఎంకే సభ్యులు ఓటు వేసిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు.
'అధికారంలోకి వస్తే సీఏఏ అమలును అడ్డుకుంటాం'
డీఎంకే అధికారంలోకి వస్తే సీఏఏను అమలు చేయబోమని స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏపై అన్నాడీఎంకే నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
సీఏఏ అమలుపై డీఎంకే అధినేత స్పష్టత
జోలార్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏపై అన్నాడీఎంకే నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మైనారిటీలకు డీఎంకే ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్న ఆయన.. తాము పార్లమెంట్‌లో ఈ బిల్లును వ్యతిరేకించామని తెలిపారు. అధికారంలోకి రాగానే కుటుంబంలో ఓ మహిళకు వెయ్యి రూపాయలు ఇస్తామని.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :'తల్లిని దూషించడం తప్పే.. క్షమించండి'