తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వాల్సిందే' - సుప్రీం కోర్టు ఆదేశాలు

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు(Supreme court news) ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిహారాన్ని(Covid death compensation) రాష్ట్ర ప్రభుత్వాలే అందించాలన్న కోర్టు.. ఏ రాష్ట్రం కూడా నిరాకరించరాదని స్పష్టం చేసింది. దరఖాస్తు అందిన 30 రోజుల్లోపు ఇవ్వాలని పేర్కొంది.

Supreme court news
సుప్రీంకోర్టు

By

Published : Oct 4, 2021, 2:09 PM IST

Updated : Oct 4, 2021, 2:26 PM IST

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు(Supreme court news) ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం(Covid death compensation) అందించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొవిడ్‌తో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం లేకున్నా పరిహారం అందించాలని ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని పేర్కొంది.

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ(ఎన్​డీఎంఏ)(NDMA guidelines) ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని(Covid death compensation) ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రంలో కరోనాతో చనిపోలేదని పేర్కొనడాన్ని ఇందుకు కారణంగా చూపరాదని తెలిపింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై ఎన్​డీఎంఏ రూపొందించిన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక సూచనలు చేసింది.

మరణ ధ్రువీకరణ పత్రం అప్పటికే జారీ చేస్తే దానిలో మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం వద్దకు వెళ్లొచ్చని సూచించింది. ఈ పథకానికి సంబంధించి మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:అమల్లో లేని చట్టాలపై నిరసనలేల?: రైతులకు సుప్రీం ప్రశ్న

Last Updated : Oct 4, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details