దేశంలో కరోనా బూస్టర్ డోసు వినియోగంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ బూస్టర్ డోస్(booster dose in India) అవసరమనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. దేశంలో అర్హులైన ప్రతిఒక్కరికీ కరోనా రెండో డోసు ఇవ్వడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా బూస్టర్ డోసులు(covid vaccine booster dose in india) ఇచ్చే విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఈ నెలాఖరులోగా ఓ విధానాన్ని ప్రకటించనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.