కుక్కల నుంచి కరోనా వ్యాపిస్తుందా అనే విషయంపై పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) స్పష్టతనిచ్చింది. శునకాల ద్వారా మనుషులకు కరోనా సోకిన కేసులేవీ ఇప్పటివరకు బయటపడలేదని పేర్కొంది. అయితే మనుషుల నుంచి కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిపింది.
"జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకిన కేసులేవీ ఈ రోజు వరకు బయటపడలేదు. ముఖ్యంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల నుంచి ఈ ప్రమాదం లేదు. కానీ, మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి."
-మణిలాల్ వల్లియతే, పెటా ఇండియా సీఈఓ