కరోనా మూడో దశ.. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనిజేషన్ (ఎన్టీఏజీఐ) ఛైర్మన్ ఎన్కే అరోరా. అయితే ప్రస్తుత వైరస్ విజృంభణ దృష్ట్యా పీడియాట్రిక్ కొవిడ్ సేవలను మెరుగుపరిచేందుకు మరిన్ని వనరులు అవసరం అని అన్నారు. ఇప్పట్లో మూడో దశ వ్యాప్తిపై ఎలాంటి అంచనాకు రాలేమని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"మూడో దశలో పిల్లలే ఎక్కువగా కొవిడ్ బారిన పడతారు అనడానికి ఆధారాలు లేవు. కానీ నవజాత శిశువులు, పిల్లలు, గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పీడియాట్రిక్ సేవలు మెరుగుపరిచేందుకు కేంద్రం కృషి చేయాలి."