తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ, ముంబయిలో హోలీ వేడుకలు నిషేధం

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ముంబయిలోనూ కొవిడ్​ ఉద్ధృతి నేపథ్యంలో.. నగరంలో మార్చి 28, 29 తేదీల్లో వేడుకలు బ్యాన్​ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

No public celebrations in Delhi, mumbai during Holi
దిల్లీ, ముంబయిలో హోలీ వేడుకలు నిషేధం

By

Published : Mar 24, 2021, 5:03 AM IST

దిల్లీ, మహారాష్ట్రల్లో కరోనా కేసులు కల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశ రాజధాని సహా ముంబయి నగరాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

దిల్లీలో ఈ ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1101 కొవిడ్​ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనూ 28వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దిల్లీ ప్రభుత్వం హోలీ, నవరాత్రి వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

కఠిన చర్యలు..

ముంబయిలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు బృహన్​ ముంబయి కార్పొరేషన్​ ప్రకటించింది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details