తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్​ న్యూస్​.. దేశంలో కరోనా థర్డ్​ వేవ్​పై క్లారిటీ!

కొవిడ్​ మూడో దశపై భయాందోళనలు నెలకొన్న తరుణంలో బెనరాస్​ విశ్వవిద్యాలయం ఊరటనిచ్చే విషయాన్ని తెలిపింది. రానున్న 3నెలల్లో థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం లేదని తమ అధ్యయంలో తేలినట్టు పేర్కొంది(corona third wave in india).

Covid third wave
థర్డ్​ వేవ్​

By

Published : Sep 14, 2021, 4:15 PM IST

దేశంలో కరోనా థర్డ్ వేవ్​ రానున్న 3 నెలల్లో వచ్చే అవకాశం లేదని ఉత్తర్​ప్రదేశ్​లోని బెనరాస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల అధ్యయనంలో తేలింది(corona third wave in india). ప్రస్తుతం దేశంలోని 70-75శాతం మంది జనాభాలో యాంటీబాడీలు ఉండడమే ఇందుకు కారణమని వారు వివరించారు.

"సెరోపాజిటివిటీ 10శాతం కన్నా తక్కువకు చేరినప్పుడే కరోనా రెండో దశ వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా మేము నెలనెలా యాంటీబాడీల స్థాయిల్ని పరిశీలిస్తున్నాం. ఇప్పుడు మనకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. సెరోపాజిటివిటీ 3-8శాతం మేర తగ్గుతోంది. మళ్లీ 10-12శాతం మేర పెరుగుతోంది.
మా అంచనాల ప్రకారం.. రానున్న 3 నెలల్లో కరోనా థర్డ్ వేవ్​ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. దేశంలోని 70-75శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నాయి. అవి రానున్న 3 నెలలపాటు ప్రభావం చూపుతాయి. నవంబర్​ నాటికి దేశంలోని 90-95శాతం మందికి టీకాలు వేయగలిగితే.. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా పెద్దగా ప్రభావం ఉండదని మేము అనుకుంటున్నాం. నవంబర్​లో మళ్లీ అధ్యయనం జరుపుతాం. ఆ తర్వాత 3 నెలలు ఎలా ఉంటాయో అప్పుడు చెబుతాం," అని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే.

దేశవ్యాప్తంగా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 25వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. అటు కొవిడ్​ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 75కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసింది(covid vaccine ).

ఇదీ చూడండి:-తగ్గుతున్న కరోనా వ్యాప్తి- దేశంలో కొత్తగా 25 వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details