తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా 2.0: రైళ్ల రాకపోకలు ఆపేస్తారా? - రైలు సర్వీసులు

రైలు సర్వీసులను నిలిపివేయడం లేదా తగ్గించే ఆలోచనే లేదని రైల్వే బోర్డు ఛైర్మన్​ సునీత్​ శర్మ స్పష్టం చేశారు. డిమాండ్​కు తగ్గట్టుగా రైలు సర్వీసులను నడుపుతామని చెప్పారు.

No plan to stop or curtail train services: Railway Board chairman.
'రైలు సర్వీసులను నిలిపివేసే ప్రసక్తే లేదు'

By

Published : Apr 9, 2021, 1:47 PM IST

Updated : Apr 9, 2021, 1:56 PM IST

రైలు సర్వీసులను నిలిపివేయడం లేదా తగ్గించే ప్రసక్తే లేదని రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్​ శర్మ​ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రైళ్లను నడుపుతున్నామని చెప్పారు. డిమాండ్​కు తగ్గట్టుగా మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

దేశంలో కరోనా విజృంభణ దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో మినీ లాక్​డౌన్​లు విధిస్తున్న నేపథ్యంలో సునీత్​ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా తగ్గించే ఆలోచన ఏదీ లేదు. అవసరానికి తగ్గట్టుగా రైలు సర్వీసులను నడుపుతాం. ఎక్కడైనా రద్దీ ఉంటే.. దానికి తగ్గట్టుగా వెంటేనే మరిన్ని రైళ్లను ఆ మార్గంలో నడుపుతాం. వేసవి కాలం కాబట్టి.. ఇప్పుడు అన్ని స్టేషన్లలో సాధారణ రద్దీనే ఉంది. ప్రయాణికులకు సరిపడా రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను."

-సునీత్​ శర్మ, రైల్వే బోర్డు ఛైర్మన్​

రైల్వే స్టేషన్​కు భారీ సంఖ్యలో వచ్చే ప్రయాణికుల వద్ద నుంచి కొవిడ్​ నెగెటివ్​ ధ్రువపత్రాన్ని తాము అడగలేమని చెప్పారు సునీత్. మహరాష్ట్ర నుంచి రైళ్లను తగ్గించాలని లేదా నిలిపివేయాలని ఎలాంటి వినతులు రాలేదని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆ స్టేషన్లలో ప్లాట్​ఫామ్​ టికెట్ల అమ్మకాలు బంద్!​

Last Updated : Apr 9, 2021, 1:56 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details