అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను ఏ కుట్రలూ నిలువరించలేవన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపాతో పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
నందిగ్రామ్ ఘటన తర్వాత తొలిసారి పురులియా జిల్లా ఝల్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మమత. తన స్వరం, గుండె పనిచేసినంత కాలం పోరాటం కొనసాగిస్తానన్నారు.
" కొన్ని రోజుల్లోనే నా కాళ్లు బాగవుతాయి. బంగాల్ గడ్డపై మీరు స్వేచ్ఛగా తిరుగుతారో లేదో నేనూ చూస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా నేతలు దిల్లీ నుంచి వస్తున్నారు. కానీ, మీరు బంగాల్ను దక్కించుకోలేరని చెబుతున్నా. టీఎంసీ ప్రభుత్వం పనిచేసినట్లుగా ప్రపంచంలోనే ఏ సర్కారు పనిచేయలేదు. ప్రధానమంత్రికి దేశాన్ని నడిపించే సామర్థ్యం లేదు. "