తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సమీర్ వాంఖడేపై మేం ఎలాంటి నిఘా పెట్టలేదు' - mumbai rave party

ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కదలికలపై నిఘా పెట్టారంటూ వస్తోన్న వార్తలను మహారాష్ట్ర మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్ తోసిపుచ్చారు. సమీర్​ను అనుసరించమని పోలీసులు, రాష్ట్ర ఏజెన్సీలకు తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై సమీర్​ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తామని తెలిపారు.

NCB officer Sameer Wankhede
ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే

By

Published : Oct 13, 2021, 7:31 AM IST

నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే(NCB officer Sameer Wankhede) కదలికలపై నిఘా పెట్టారంటూ వస్తోన్న వార్తలను మహారాష్ట్ర మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్ తోసిపుచ్చారు. దానిపై తాము ఏ దర్యాప్తు సంస్థకు ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ముంబయి తీర ప్రాంతంలోని ఓ క్రూజ్ నౌకలో రేవ్ పార్టీ(mumbai rave party ship) జరుగుతుందనే సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు కొద్దిరోజుల క్రితం దాడులు జరిపారు. ఆ పార్టీలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్(shah rukh khan son news) సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. అక్కడ డ్రగ్స్ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులు సమీర్ వాంఖడే నేతృత్వంలో జరిగాయి. ఈ క్రమంలో తనను కొందరు అనుసరిస్తున్నట్లు వాంఖడే అనుమానం వ్యక్తం చేశారు. తన కదలికలపై నిఘా పెట్టారని ఆరోపిస్తూ వాంఖడే మహారాష్ట్ర పోలీసు చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి.

ఈ వార్తలపై మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్ స్పందించారు. 'సమీర్ వాంఖడేను(Sameer Wankhede) అనుసరించమని పోలీసులు, రాష్ట్ర ఏజెన్సీలకు మేం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. సమీర్ మహారాష్ట్ర పోలీసు చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. దీన్ని మేం పరిశీలిస్తాం' అని మంత్రి వెల్లడించారు.

వాంఖడే తన తల్లిని ఖననం చేసిన ప్రదేశానికి ప్రతి రోజూ వెళ్తుంటారు. అక్కడి సీసీటీవీ పుటేజీని పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు సేకరించినట్లు గుర్తించామని ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది చాలా తీవ్రమైన విషయమని ఆందోళన వ్యక్తం చేసిన వాంఖడే, ఆ వివరాలు చెప్పడానికి మాత్రం నిరాకరించారు.

మరోపక్క సోమవారం ఆర్యన్‌ ఖాన్‌కు(shah rukh khan son news) కోర్టులో చుక్కెదురైంది. మూడోసారి కూడా బెయిల్ దొరకలేదు. దానికి సంబంధించిన తదుపరి విచారణ ఈ బుధవారం జరగనుంది.

ఇదీ చూడండి:సమీర్‌ వాంఖడే.. 'తెర'చాటు డ్రగ్స్‌పై ముంబయి 'సింగం'

ABOUT THE AUTHOR

...view details