సోషల్ మీడియా(social media) వినియోగదారులపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు కొత్త ఐటీ నిబంధనల్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదంతా కేవలం దుష్ప్రచారమే అని పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా గురువారం ప్రకటించింది. నిబంధనలపై ట్విట్టర్‌తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
social media: యూజర్లపై కేంద్రం నిఘా- నిజమేనా? - ఐటీ రూల్స్‌పై కేంద్రం వివరణ
కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. సోషల్ మీడియా(social media) వినియోగదారుల ఫోన్ కాల్స్‌ను పర్యవేక్షించనున్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. అటువంటి విషయాలు కొత్త నిబంధనల్లో లేవని స్పష్టం చేసింది.
'కొత్త నిబంధనల్లో అలా లేదు'
సోషల్ మీడియా(social media) యూజర్లను తరచూ పర్యవేక్షించడం సహా ఫోన్ కాల్స్‌ను పరిశీలించడం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల్లో భాగమని ప్రచారం సాగుతోంది.
ఇదీ చదవండి :New IT rules: పోలీసుల బెదిరింపులపై ట్విట్టర్ ఆందోళన!