నాగాలాండ్‌లో సోమవారం కొత్త కరోనా కేసులేమీ నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎస్ పంగ్న్యూ ఫామ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,192గా ఉంది. ఒకరు మహమ్మారి బారినుంచి బయటపడగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 11,937కి చేరుకుంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.
యాక్టివ్ కేసులు 12
ప్రస్తుతం నాగాలాండ్‌లో 12 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 10 మంది కోహిమాకు చెందిన వారుకాగా.. మరో ఇద్దరు దిమాపూర్ వావాసులని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ డెనిస్ హాంగ్సింగ్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.90శాతంగా ఉందని ఆయన వివరించారు.