తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో సరిపడా ఆక్సిజన్.. కానీ...' - న్యూయార్క్​ నుంచి భారత్​కు 318 ఆక్సిజన్​ తయారీ పరికరాలు

దేశంలో ఆక్సిజన్​కు ఏమాత్రం లోటు లేదని కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే.. దాన్ని అవసరమున్న ప్రాంతాలకు సరఫరా చేయడంలో రవాణా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొంటామని చెప్పింది.

Oxygen Cylinders
ఆక్సిజన్​

By

Published : Apr 26, 2021, 7:15 PM IST

Updated : Apr 26, 2021, 9:16 PM IST

భారత్​లో తగినంత ప్రాణవాయువు నిల్వ ఉందని కేంద్ర హోం శాఖ తెలిపింది. కానీ.. ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి అధిక డిమాండ్​ ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసే విషయంలో రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. త్వరలోనే ఆ సమస్యను అధిగమిస్తామని స్పష్టం చేసింది.

వాయుసేన విమానాల సాయంతో ఆక్సిజన్​ సిలిండర్లు రవాణా సమయాన్ని ఇప్పటికే 4-5 రోజుల నుంచి 1-2 గంటలకు తగ్గించామని హోం శాఖ అదనపు కార్యదర్శి పీయూష్​ గోయల్​ తెలిపారు.

"మనకు తగినంత ఆక్సిజన్​ నిల్వ ఉంది. సమయానికి సరఫరా చేయడమే సమస్యగా మారింది. అయితే.. అందరూ చురుగ్గా పాల్గొనేలా చేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నాం."

- పీయూష్​ గోయల్​, హోంశాఖ అదనపు కార్యదర్శి

ఇదీ చదవండి:ఆక్సిజన్​ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి

ప్రాణవాయువు కొరత​ గురించి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గోయల్​ సూచించారు. సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్న ఆయన.. అతి తక్కువ సమయంలోనే ఆక్సిజన్​ సిలిండర్లను ఆయా ఆస్పత్రులకు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

న్యూయార్క్​ నుంచి 318 కాన్సంట్రేటర్స్​..

దేశంలో ప్రాణవాయువు కొరతను తీర్చేందుకు న్యూయార్క్​ నుంచి ఎయిర్​ఇండియా విమానాల ద్వారా 318 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్స్​(ప్రాణవాయువు తయారీ పరికరాలు) తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్​దీప్​సింగ్​ పురి సోమవారం తెలిపారు.

"మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం 318 ఫిలిప్స్​ ఆక్సిజన్​ కాన్సంట్రేటర్స్​ను ఎయిర్​ఇండియా విమానంలో తెప్పించాం."

- హర్​దీప్​సింగ్​ పురి, పౌరవిమానయాన మంత్రి

ఇదీ చదవండి:ఉతక్కుండా కొత్త బట్టలు ధరించకూడదా?

Last Updated : Apr 26, 2021, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details