వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై లోక్సభలో మాట్లాడిన ఆయన.. రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని, అయితే అన్నదాతల డిమాండ్లు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు మోదీ. రైతు సంఘాల నేతలతో అనేక సార్లు చర్చలు జరిపామని తెలిపారు. వ్యవసాయ చట్టాలు రైతుల సంక్షేమం కోసమే తీసుకొచ్చినట్లు వివరించారు. రైతులకు ఈ చట్టాలు ఇబ్బందిగా ఉంటే వాటిపై తప్పనిసరిగా దృష్టిసారిస్తామని హామీ ఇచ్చారు. సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగిందంటూ ఎదురు ప్రశ్నించారు మోదీ.