తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీరెవరూ వడ్డీ నష్టపోలేదు'.. PF చందాదారులకు కేెంద్రం క్లారిటీ! - EPF subscribers Interest

ఈపీఎఫ్‌ఓ చందాదార్లకు వడ్డీపరంగా ఎటువంటి నష్టం జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అందరి అకౌంట్లల్లోనే ఆ వడ్డీ జమైనట్లు పేర్కొంది.

EPF subscribers Interest
epf

By

Published : Oct 7, 2022, 7:23 AM IST

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదార్లకు వడ్డీపరంగా ఎటువంటి నష్టం జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియ వల్లే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైందని పేర్కొంది. సెటిల్‌మెంట్‌, పీఎఫ్‌ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీతో కలిపే చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది.

"చందాదార్లు ఎవరికీ వడ్డీ నష్టం జరగలేదు. అందరి ఖాతాల్లో వడ్డీ జమ అయింది. పన్ను విధానంలో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియ చేపట్టడంతో.. వడ్డీ జమ అయినట్లు స్టేట్‌మెంట్‌లో కనిపించలేదు" అని మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

ఈపీఎఫ్‌ వడ్డీ జమ విషయంలో టి.వి.మోహన్‌దాస్‌ పాయ్‌ లేవనెత్తిన సందేహాలకు స్పందిస్తూ ఆర్థిక శాఖ ఈ స్పష్టత ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వార్షికంగా పీఎఫ్‌ జమ రూ.2.5 లక్షలకు మించితే పన్ను విధించడాన్ని 2021-22 నుంచే ప్రభుత్వం ప్రారంభించింది.

ఇదీ చదవండి:కొత్త ఫ్రిజ్​ కొంటున్నారా?.. అయితే ఈ వివరాలు ఉన్నాయో లేదో చూసుకోండి!

చెరువులో గేదె దిగిందని.. మహిళను నీటిలో ముంచి.. విచక్షణారహితంగా.

ABOUT THE AUTHOR

...view details