కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కేసుల తీవ్రత అధికంగా ఉన్న రాయ్‌పుర్, దుర్గ్సహా 8 జిల్లాల్లో ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తుండగా.. మరో 8 జిల్లాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి 3 జిల్లాల్లో 10 రోజులు, మిగతా జిల్లాల్లో ఆదివారం నుంచి 8 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
ఛత్తీస్‌గఢ్‌లో 76వేలకు పైగా యాక్టివ్ కేసులుండగా రాయ్‌పుర్, దుర్గ్జిల్లాల్లోనే సగం కేసులు ఉన్నాయి. మరోవైపు.. రైలు, వాయు మార్గం ద్వారా రాష్ట్రానికి రావాలనుకున్నవారు 72 గంటల లోపు పరీక్షించిన ఆర్టీపీసీఆర్ కరోనా నెగెటివ్ ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ
గుజరాత్ సైతం ఆంక్షలను కఠినతరం చేస్తోంది. ఇప్పటివరకు సూరత్‌లోని పట్టణ ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండగా, దానిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఆదివారం నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కర్ఫ్యూ రాత్రి 8గంటలకు ప్రారంభమై ఉదయం ఆరు గంటలకు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను ఈ నెల 30 వరకు మూసివేయాలని నిర్ణయించారు.
లాక్డౌన్ వద్దు.. కరోనా కర్ఫ్యూనే ముద్దు!