గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ నటుడు దీప్ సిధుతో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు భాజపా ఎంపీ సన్నీ దేఓల్. 'ఇదే విషయాన్ని గతంలోనే స్పష్టం చేశాను. మా కుటుంబ సభ్యులకు దీప్ సిధుకు సంబంధాలు లేవని గతేడాది డిసెంబరు 6న ట్విట్టర్ వేదికగా తెలిపాను' అని మంగళవారం రాత్రి మరో ట్వీట్ చేశారు దేఓల్.
జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు దేఓల్. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ఆందోళనకారుల్లో సిధు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తనకు సిధుతో సంబంధాలున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు దేఓల్.