అధికార, ప్రతిపక్ష నాయకులు (assembly on childrens day) పరస్పరం మాటల యుద్దానికి దిగడం.. విపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన ప్రదర్శన చేపట్టడం.. వాకౌట్ చేయడం.. ఇవన్నీ చట్టసభల్లో తరచూ జరిగేవే! ఆదివారం రాజస్థాన్ విధానసభ సమావేశంలోనూ ఇవన్నీ కనిపించాయి. మరి అందులో వింతేముంది అనుకుంటున్నారా! అక్కడే ఉంది అసలు మెలిక. ఆ సమావేశాన్ని నిర్వహించింది.. నిజంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదు.. పిల్ల ఎమ్మెల్యేలు! స్పీకర్, సీఎం, ప్రతిపక్ష నేత సహా అందరూ చిన్నారులే.
పిల్లలే ఎమ్మెల్యేలైన వేళ.. అసెంబ్లీలో అరుదైన దృశ్యం - రాజస్థాన్లో మాక్ అసెంబ్లీ
అసెంబ్లీలో (assembly on childrens day) గంటపాటు ప్రత్యేక సమావేశం జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం, నిరసనలు, వాకౌట్లు కనిపించాయి. అయితే.. నిజంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదు. చిన్నారులే శాసనసభ్యులుగా (mock assembly) అవతారమెత్తారు. ఈ దృశ్యాలు రాజస్థాన్ అసెంబ్లీలో కనిపించాయి.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజస్థాన్ అసెంబ్లీలో (childrens day special programme) గంటపాటు ఈ ప్రత్యేక మాక్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. 6-16 ఏళ్ల వయసున్న 200 మంది పిల్లలు అందులో పాల్గొన్నారు. శాసనసభ్యులుగా అవతారమెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు పిల్ల ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించి, బాల మంత్రుల నుంచి సమాధానాలు డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరసిస్తూ చిన్నారి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొందరు వెల్‌లోకి దూసుకెళ్లి ధర్నా నిర్వహించారు. చర్యలు తీసుకుంటామంటూ 'ప్రభుత్వం' నుంచి హామీ వచ్చాక శాంతించారు. కాంపిటీటివ్ పరీక్షల సమయంలో అంతర్జాలాన్ని స్తంభింపజేస్తుండటంపై మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎమ్మెల్యేలు ఓ దశలో వాకౌట్ కూడా చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి, సీఎం అశోక్ గహ్లోత్ తదితరులు ఈ ప్రత్యేక సమావేశాన్ని వీక్షించి, చిన్నారులపై ప్రశంసలు కురిపించారు.
ఇదీ చదవండి:శాఖల్లో పారదర్శకత ఇక కేంద్ర మంత్రుల బాధ్యతే!