తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ... ఇది ఆరంభం మాత్రమే: రాహుల్ - delhi nirankari samagam maidan

మోదీ సర్కార్​పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. సత్యం కోసం రైతులు చేసే యుద్ధాన్ని.. జగతిలోని ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని ట్వీట్​ చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

No govt in the world can stop farmers fighting 'battle of truth': Rahul
'నేను రైతులతోనే మోదీజీ.. ఇది ఆరంభం మాత్రమే'

By

Published : Nov 27, 2020, 4:44 PM IST

సత్యం కోసం రైతులు చేసే పోరాటాన్ని ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని అన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఛలో దిల్లీ పేరిట రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన ఆయన​.. నరేంద్ర మోదీ సర్కార్​పై విరుచుకుపడ్డారు. సత్యంపై అహంకారం ఎప్పుడూ గెలవదని ఉద్ఘాటించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని 'IamWithFarmers' హాష్​ట్యాగ్​తో హిందీలో ట్వీట్​ చేశారు.

రాహుల్​ ట్వీట్​

''సత్యం కోసం రైతులు చేసే పోరాటాన్ని లోకంలోని ఏ ప్రభుత్వమూ ఆపలేదు. ఇప్పటికైనా రైతుల డిమాండ్లను మోదీ ప్రభుత్వం స్వీకరించి.. సమస్యలకు పరిష్కారం చూపాలి. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి. ఇది ఆరంభం మాత్రమే.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్​, హరియాణా రైతులు.. దిల్లీ బాట పట్టారు. తీవ్ర ఉద్రిక్తతల అనంతరం బురారీలోని నిరంకారీ సమాగం మైదానంలో శాంతియుత నిరసనలు చేసుకునేందుకు పోలీసులు అనుమతిచ్చారు.

ఇదీ చూడండి:'ఛలో దిల్లీ'కి పోలీసులు ఓకే- రైతుల హర్షం

ABOUT THE AUTHOR

...view details