కేరళలో అధికార ఎల్డీఎఫ్పై కాంగ్రెస్ విరుచుకుపడింది. భాజపా నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏతో ఎల్డీఎఫ్కు అంతర్గత సంబంధాలున్నాయని ఆరోపించింది. దీని కారణంగానే.. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్‌తో సహా ముగ్గురు మంత్రులు, స్పీకర్‌పై దర్యాప్తు సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పేర్కొంది.
"బంగారం స్మగ్లింగ్ కేసుతో సీఎం విజయన్ సహా ముగ్గురు మంత్రులు, స్పీకర్లకు సంబంధాలున్నాయని ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ చెప్పారు. అయినా వారిపై చర్యలేమీ తీసుకోలేదు. కానీ, విజయన్ మాజీ కార్యదర్శిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ప్రధాని మోదీతో విజయన్‌కి ఉన్న అంతర్గత సంబంధాలే సీఎంపై దర్యాప్తు సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆపుతున్నాయి."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి