కర్ణాటక ప్రభుత్వంతో ఎలాంటి న్యాయ పోరాటానికి కేఎస్ఆర్టీసీ(కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) సిద్ధంగా లేదని ఆ సంస్థ సీఎండీ బిజు ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు కేరళ ఆర్టీసీ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
'కేఎస్ఆర్టీసీ లోగో విషయంలో కర్ణాటకపై ఎలాంటి పోరాటం చేయబోము. ఈ సమస్యను సరైన పద్ధతిలో పరిష్కరించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అవసరమైతే.. కార్యదర్శి, మంత్రుల స్థాయిలో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయజేస్తాం' అని కేరళ ట్రాన్స్పోర్ట్ ఫేస్బుక్ పోస్ట్ పేర్కొంది.