5-12 Years Covid Vaccine: దేశంలోని 5-12 ఏళ్ల వయసు గల చిన్నారులకు కరోనా టీకా పంపిణీపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అంతకుముందు.. పిల్లలకు టీకా పంపిణీపై కేంద్రం శుక్రవారం ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. టీకా పంపిణీపై ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) శుక్రవారం నిర్వహించే సమావేశంలో సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఐదేళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు.
మరోవైపు 12-17 ఏళ్ల వయసు మధ్య వారికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొవొవాక్స్ టీకాకు ఎన్టీఏజీఐ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే సీరం సంస్థ 18 ఏళ్లుపైబడిన వారికి టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది.