తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బన్​లో క్రీమ్​ లేదని.. బేకరీ యజమానిపై కస్టమర్ల దాడి!

Cream Bun Attack: ఆర్డర్​ ఇచ్చిన బన్​లో క్రీమ్​ లేదని కొందరు దుండగులు.. బేకరీ యజమానిపై దాడి చేశారు. అడ్డొచ్చిన అతడి కుటుంబసభ్యులను కూడా దారుణంగా కొట్టారు. ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో జరిగింది.

Cream Bun Attack
Cream Bun Attack

By

Published : May 26, 2022, 8:10 PM IST

Cream Bun Attack: బన్​లో క్రీమ్​ లేదని ఓ గుంపు.. బేకరీ యజమానితో పాటు అతడి కుటుంబంపై దారుణంగా దాడి చేసింది. కేరళలోని కొట్టాయంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
కొట్టాయంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న శివకుమార్ బేకరీకి బుధవారం సాయంత్రం టీ తాగేందుకు కొందరు గుంపుగా వచ్చారు. టీతో పాటు క్రీమ్ బన్​ ఆర్డర్ ఇచ్చారు. అయితే బన్‌లో క్రీమ్​ లేదని ఆ బృందంలోని ఓ వ్యక్తి.. బేకరీ యజమానిని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో గొడవ మొదలైంది. తర్వాత యజమాని శివకుమార్​పై ఆ గుంపులో కొందరు దాడి చేశారు. భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు యత్నించిన ఆయన భార్య కవిత, పిల్లలను కూడా కొట్టారు. గాయపడిన శివకుమార్​ కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబసభ్యులు

ఈ ఘటనలో దుకాణంలో టీ తాగుతున్న వేలాయుధన్ (95) కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. బేకరీ కూడా తీవ్రంగా ధ్వంసమైందని చెప్పారు. మరోవైపు తమపై బేకరీ యజమాని, కుటుంబ సభ్యులు దాడి చేశారని.. గుంపులోని సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ఫిర్యాదులను అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details