తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు' - దేశంలో సున్నా కేసులు

దేశంలో 180 జిల్లాల్లో గతవారం రోజులుగా కరోనా కొత్త కేసులేమీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. 54 జిల్లాల్లో 3 వారాలుగా, 32 జిల్లాల్లో 4 వారాలుగా ఎలాంటి కేసులు నిర్ధరణ కాలేదని చెప్పారు. కొవిడ్​ వ్యాధి నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

Harsh Vardhan
'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు'

By

Published : May 9, 2021, 5:28 AM IST

Updated : May 9, 2021, 6:33 AM IST

దేశంలో 180 జిల్లాల్లో గతవారం రోజుల్లో కొత్త కొవిడ్ కేసులేమీ రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. మహమ్మారి పరిస్థితిపై మంత్రుల బృందం (జీఓఎం) 25వ ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఆన్​లైన్​ విధానంలో ఆయన శనివారం మాట్లాడారు. 54 జిల్లాల్లో 3 వారాలుగా, 32 జిల్లాల్లో 4 వారాలుగా ఎలాంటి కేసులు రాలేదని చెప్పారు. ఇంతవరకు 4,88,861 మంది కొవిడ్ బాధితులకు ఐసీయూ, 1,70,841 మందికి వెంటిలేటర్, 9,02,291 మందికి ఆక్సిజన్ అవసరమొచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న క్రియాశీలక కేసుల్లో 1.34% మంది ఐసీయూ, 0.39% మంది వెంటిలేటర్లు, 3.70% మంది ఆక్సిజన్ మీద ఉన్నట్లు తెలిపారు.

రెండు డోసులతో రక్షణ..

కొవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అందరికీ రెండో డోసు అందించాలని, కేంద్రం పంపించే టీకాల్లో 70% రెండో డోసు కోసమే కేటాయించాలని పేర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్​కుమార్ సింగ్ మాట్లాడుతూ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కరోనా పరీక్షలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు వేగంగా పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇదీ చూడండి:కాలువలో వరదలా రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు!

Last Updated : May 9, 2021, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details