బలగాల ఉపసంహరణ తర్వాత చైనాతో భారత్కు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిబంధనలు అలాగే కొనసాగుతాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన తొలగిపోనున్న నేపథ్యంలో భారత్లో పెట్టుబడి పెట్టేందుకు చైనా కంపెనీలు తరలి వస్తాయని మీడియాలో వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు.
" చైనాతో భారత్కు ఉన్న ఎఫ్డీఐ నిబంధనల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. భవిష్యత్లో రద్దు చేయాలన్న ప్రణాళిక సైతం మా వద్ద లేదు. ఎప్పటిలాగానే చైనా నుంచి వచ్చే కంపెనీలు భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. నిబంధనలు పాటించాలి. దేశ భద్రతకు ముప్పు లేదని భావించిన కంపెనీలకే కేంద్ర అనుమతి ఉంటుంది."
-- కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు